త్వరలో రేషన్ దుకాణాల్లో పోష్టికాహార బియ్యం పంపిణి..

0
113

పేదకుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి ఆహార భద్రత పథకం. ఈ పథకం ప్రకారం కుటుంబ సభ్యులను బట్టి ఆహార ధాన్యాలు అందిస్తారు. రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలు కూడా పంపిణి చేస్తూ ప్రజలను ఆదుకుంటుంది. ఈసారి  కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మధ్యాహ్న భోజన పథకం నుంచి రేషన్ దుకాణాల వరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి పోష్టికాహార బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా మహిళలలో, చిన్న పిల్లలో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 2024 నాటికి పేద వారికి ప్రభుత్వ స్కీమ్‌ల ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. చాలా మంది మహిళలు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.