మనిషికి కచ్చితంగా ఇతరులకి దానం చేసే గుణం ఉండాలి. ఎందుకంటే దాని వల్ల ఎంతో పుణ్యం. అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పది. అయితే ఉన్నవాడు లేని వారికి ఏం సాయం చేసినా అది పుణ్యఫలమే. అయితే కొన్ని దానం చేసే సమయాల్లో పెద్దలు చెప్పిన విషయాలు కచ్చితంగా పాటించాలి. అన్ని వస్తులువు అన్నీ సమయాల్లో దానం ఇవ్వకూడదు అని పెద్దలు, పండితులు తెలియచేస్తున్నారు.
ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎలాంటి వస్తువులు దానం ఇవ్వకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సాయంత్రం ఆరు గంటల తర్వాత పసుపు, కుంకం, గంధం ఇలాంటివి ఎవరికి దానం ఇవ్వకూడదు.
2. సూర్యాస్తమయం తరువాత డబ్బు ఇవ్వకూడదని అనేక మంది నమ్ముతారు. అయితే అవతల వారు ఇబ్బందుల్లో ఉంటే ఆ సాయం చేయవచ్చు.
3. వాచ్ అనేది ఎప్పుడూ సాయంత్రం వేళ దానం చేయడం వేరొకరిది చేతికి పెట్టుకోవడం చేయకూడదు.
4. సూర్యాస్తమయం తరువాత ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదు.
5.మిగిలిపోయిన ఆహారాన్ని, పాడై పోయిన ఆహారాన్ని ఇతరులకు దానం చేయకూడదు. అవి గోవులకి కూడా పెట్టకూడదు.