జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

Do this to avoid problems in life ..!

0
96

జీవితంలో అందరికి ముందుకు వెళ్లాలని ఉంటుంది. అలా జరగాలంటే కొన్ని విషయాలను మనం  అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం. సాధారణంగా ఈ లోకంలో సమస్య లేని వారంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.

ఆ సమస్యలు దగ్గట్టుగా మనం నడుచుకోవాలి. లేదంటే ఆ సమస్య లేకుండా నడుచుకోవాలి అని ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలను గుర్తించుకోవాలి. అయితే జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా, ఇబ్బందులు అధిగమించాలన్నా ఈ విషయాలను అర్థం చేసుకోవాలని చాణక్య తెలిపారు. అయితే మరి ఎటువంటి ఆలస్యం చేయకుండా వాటిని చూసేద్దాం. తెలివితేటలు ఉన్న మనిషి తన ఇంద్రియాలను కొంగల ఉపయోగించుకోవాలని ఆచార్య చెప్పారు. సమయం, తన యొక్క సామర్థ్యం, ఉండేచోటు అన్నిటినీ అర్థం చేసుకుని ఫలితాన్ని నిరూపించుకుంటే గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి.

అదేవిధంగా మూర్ఖుడు తన తప్పును తెలుసుకోడు అని చాణక్య చెప్పారు. పైగా ఎప్పుడూ కూడా తప్పులు చూసి వాదనలు పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి మూర్ఖులకి సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది అని అన్నారు. భవిష్యత్తులో మీరేం చేయాలనుకున్న ప్రణాళికను ఎవరికీ చెప్పకండి. ఒకవేళ కనుక మీరు విజయం సాధించకపోతే ఎగతాళి చేస్తారు. దీనితో మీరు మీపై విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి పని పూర్తయ్యే వరకు కూడా రహస్యంగా ఉండండి.

అదేవిధంగా సమతుల్యమైన మనసుకు సమానమైన తపస్సు లేదు అని ఆచార్య చెప్పారు. సంతృప్తికి సమానమైన ఆనందం లేదు. దురాశ వంటి వ్యాధి లేదు. దయ వంటి ధర్మం లేదు. అలాగే అతి మధురంగా మాట్లాడే వారి పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. కనుక వీటిని ఎల్లప్పుడు గుర్తుంచుకుని అనుసరించండి. అప్పుడు ఇబ్బందే ఉండదు.