మీకు రేషన్‌కార్డు ఉందా? అయితే ఈ తప్పులు చేయకండి..

Do you have a ration card? But do not make these mistakes.

0
84

మనకున్న డాక్యూమెంట్లలో రేషన్ కార్డు ముఖ్యమైనది. దీని ద్వారా మనం రేషన్ బియ్యం, ఇతర సరుకులు పొందవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఏమైనా తేడా ఉంటే ఆ కార్డును రద్దు చేస్తుంది. కనుక అటువంటివి జరగకుండా చూసుకోండి.

మీరు చాలా కాలంగా ఆహార ధాన్యాలు తీసుకోవడానికి మీ రేషన్ కార్డును ఉపయోగించకపోతే అప్పుడు తప్పని సరిగా మీ రేషన్ కార్డు ని రద్దు చేసే అవకాశం వుంది. ఈ పధకం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే. వాస్తవానికి మీరు ఏ నెలలో రేషన్ తీసుకున్నారు. ఎంత మంది కుటుంబ సభ్యులు వున్నారు అనేది రేషన్ కార్డులో ఉంటుంది. అయితే రూల్స్ ప్రకారం రేషన్ కార్డు ఉంటేనే మీకు పీడీఎస్‌లో ఆహార ధాన్యాలు అందుతాయి. చాలా కాలంగా ఉపయోగించని రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసుకుంటూ వచ్చారు.

ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోతే నిబంధనల ప్రకారం అతనికి తక్కువ ధరకు లభించే ఆహార ధాన్యాలు అవసరం లేదని తెలుస్తుంది. ఈ కారణాల ఆధారంగా ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వ్యక్తి రేషన్ కార్డుని రద్దు చేస్తారు. ఒకవేళ మీ రేషన్ కార్డు రద్దు అయితే దానిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ రాష్ట్రంలోని AePDS అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించచ్చు.