చిత్రగుప్తుడు యముడి దగ్గర ఎలా చేరాడో తెలుసా ?

Do you know how Chitragupta joined Yama ?

0
92

 

చిత్రగుప్తుడు ఈ మాట వినగానే మనకు ముందు యముడు గుర్తుకు వస్తాడు అక్కడ యమధర్మరాజు దగ్గర ఉండి పెద్ద పుస్తకంలో మనుషులు చేసే పాప పుణ్యాల చిట్టాని రాస్తూ ఉంటాడు, దాని ప్రకారం యముడు ఆ వ్యక్తులకి శిక్షలు వేస్తాడు, అందుకే చిత్ర గుప్తుడికి కూడా ఎంతో పేరు ఉంది.

చిత్రగుప్తుడు మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో తేలుస్తాడు. చిత్రగుప్తుడు భారత్ లోనూ, నేపాల్ లోనూ కాయస్థులకు ఆరాధ్య దేవుడు. ఇక చిత్ర గుప్తుడు ఎవరంటే , ఆయన బ్రహ్మకి పుత్రుడు. ఇక మన పురాణాల్లో చూస్తే బ్రహ్మకు ఎంతో మంది సంతానం అందులో చిత్ర గుప్తుడు కూడా బ్రహ్మ శరీరం నుంచి జన్మించారు.

బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించ లేక ఇబ్బంది పడతాడు, ఒక్కోసారి ఇలా కొందరిని స్వర్గానికి , నరకానికి పంపడంతో యముడు ఎన్నో ఇబ్బందులు పడతాడు. దీంతో బ్రహ్మ యముడికి చిత్ర గుప్తుడ్ని అప్పగిస్తాడు. అప్పటి నుంచి వారి పాప పుణ్యాల చిట్టా సిద్దం చేసి యముడికి సాయం చేస్తాడు చిత్ర గుప్తుడు.