వాలెంటైన్స్ డే ఎలా మొదలైందో తెలుసా?

0
104

అసలు ఈ వాలెంటైన్స్ డే ఎలా మొదలైంది ? వాలెంటైన్స్ డే చరిత్ర ఏంటో తెలుసా? వాలెంటైన్స్ డే అనేది రోమన్ కాలం నుండి ఉంది. ఆ కాలంలో యుద్ధ సమయంలో పురుషులు ఎవరు స్త్రీలని వివాహం చేసుకోకూడదనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను అప్పటి చక్రవర్తి క్లాయూడీఎస్ 2 ఆమోదించడం జరిగింది.

కానీ, వాలెంటైన్ అనే మత గురువు ప్రేమికులకు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారు. ఎప్పుడైతే రాజుకు ఈ విషయం తెలిసిందో వాలెంటైన్ ని జైలులో నిర్బంధించారు. జైల్లో ఉండగా వాలెంటైన్ ఆ జైలు అధికారి కుమార్తెతో స్నేహం చేసాడు. అయితే జైలు అధికారి కుమార్తెకు కళ్ళు లేవు, ఆమెకు కళ్ళు తెప్పించడానికి వాలెంటైన్ చనిపోయాడని చరిత్ర చెప్తుంది.

వాలెంటైన్ చనిపోయే ముందు ఆమెకు ఒక ఉత్తరం రాసాడు అందులో ” మీ వాలెంటైన్ నుండి ” అని సంతకం చేసి ఉంటుంది. ఈ సంఘటన ఫిబ్రవరి 14వ తేదీన జరిగింది. అందుకే ఈ రోజుని వాలెంటైన్స్ డే గా జరుపుకోమని అధికారికంగా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు.