ప్రపంచంలో అసలు ఎక్కువ కాలం బతికే జంతువులు ఏమి ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా ?నిజమే కొన్ని జీవులు ఉన్నాయి ఏకంగా మనవాళ్లని మూడు తరాలని చూసే అంత జీవితం కాలం అవి బతుకుతాయి.వీటి ఆయుష్షు తెలిస్తే అమ్మో అంటారు. మనిషికి 100 ఏళ్లు గరిష్ట జీవితకాలం అయితే ఈ జంతువులకి మాత్రం వందల ఏళ్లు ఉంది. అవి ఏమిటో చూద్దాం.
1..తాబేలు – ఎక్కువ కాలం జీవించే జీవి. ఇది రెండు వందల ఏళ్లకు పైగా జీవిస్తుంది. కోల్ కత్తాలోని అలీ పూర్ జూలో అడ్వేత అనే తాబేలు 255 ఏళ్ల వయసులో మరణించింది.
2..రఫియన్ రాక్ ఫిష్ – ఇది చాలా పెద్ద చేప ఎక్కువ కాలం జీవించి ఉంటుంది. దాదాపు 205 ఏళ్లు బతికింది. ఈ చేప పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఇవి చాలా అరుదుగా ఉన్నాయి.
3. బౌ హెడ్ వేల్ – ఇది ఆర్కిటిక్ సముద్రాల చుట్టుపక్కల కనిపిస్తుంది. ఇది సుమారు 105 ఏళ్లు జీవిస్తుంది. కానీ దీనికి ఏ ప్రమాదం జరగకుండా వేటకి గురి అవ్వకుండా ఉంటే 150 ఏళ్లు ఉంటాయి.
4..మంచినీటి పెర్ల్ మసెల్స్ – ఇవి సముద్రంలో ఆహారం తీసుకుంటూ 200 ఏళ్లు జీవిస్తాయి.
5. గ్రీన్ లాండ్ షార్క్ – ఇది ఏకంగా 300 ఏళ్లు దాటి బతుకుతుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో లోతులో ఇది జీవిస్తుంది.