పులస కన్నా ఖరీదైన చేప ఏమిటో తెలుసా ? ధర 2 లక్షలు దీని స్పెషాలిటీ ఇదే

-

మనం చాలా వరకూ పులస చేప ఖరీదు అయింది అని అనుకుంటాం, పులస కోసం పుస్తెలయినా సరే తాకట్టు పెట్టొచ్చని. పులస చేప గురించి చెప్పుకుంటాం, కాని మన తెలుగు స్టేట్ లో మరో చేప కూడా ఉందట, ఇది దేశంలో చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది.. కాని చాలా అరుదుగా దొరుకుతుంది, మత్స్యకారులకి దొరికితే వారు లక్కీ పర్సెన్ అవుతారు, అంతేకాదు లక్షల రూపాయలు వారికి దక్కుతాయి.

- Advertisement -

మరి ఆచేప ఏమిటి అంటే కచిడి చేప. సముద్రంలో దొరికే కచిడి అనే ఈ చేపకు మాత్రం ధర లక్షల్లో పలుకుతుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది, . సముద్రంలో చాలా అరుదుగా కనిపించే ఈ చేప దొరికితే ఇక వారికి పండుగే, ఎందుకు అంటే ఇది బరువు సుమారు 25 నుంచి 30 కిలోలు ఉంటుంది, దీని ధర రెండు లక్షల వరకూ ఉంటుంది.

ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ చేపలోని శరీర భాగాలతో కొన్ని మందులు తయారు చేస్తారు, అలాగే దాని పొట్టలో ఉండే భాగాలకే 80 శాతం నగదు ఇస్తారట, సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్తో తయారు చేస్తారట. ఇక కొన్ని రకాల వైన్స్ తయారీలో దీని ఆయిల్ వాడతారు..కచిడి చేప పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల్లో వాడతారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...