మన దేశంలో ఈ ప్రాంతంలో సూర్యుడు ఐదుగంటలకే వచ్చి పలకరిస్తాడు. అన్నీ ప్రాంతాల్లో కంటే ముందే గుడ్ బై చెబుతాడు. ముందు తొలి కిరణాలు ఇక్కడ నుంచే ప్రసరిస్తాయి. మరి ఆ గ్రామం ఏమిటో చూద్దాం. ఆ గ్రామం పేరు దోంగ్ గ్రామం. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు ఇక్కడే తాకుతాయి. అందుకే మన భారతీయులతో పాటు ఇతర దేశాల నుంచి చాలా మంది టూరిస్టులు ఇక్కడకు వస్తారు.
దోంగ్ చాలా చిన్న గ్రామం. పదేళ్ల కిందట అయితే అక్కడ ఇల్లు కట్టుకుని స్థిరంగా నివసిస్తున్న జనం పదిహేను మంది మాత్రమే.ఇప్పుడు జనాభా పెరిగారు, ఇక పర్యాటకులు ఎవెరైనా వస్తే జస్ట్ ఇక్కడ చూసి వెళ్లిపోవాలి. వారికి ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ నుంచి తేజు, వాలాంగ్ పట్టణాలు దగ్గర్లో ఉన్నాయి. వారు ఇక్కడ స్టే చేయవచ్చు.
ఇక్కడ ట్రెక్కింగ్ కూడా కొందరు చేస్తారు. ఓ వైపు చైనా, మరో వైపు మయన్మార్ దేశాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇది చూసేందుకు వేలాది మంది ప్రతీ ఏడాది వస్తారు. అందుకే చాలా మంది ఈ ప్రాంతానికి ఉదయమే వచ్చి ఈ తొలి కిరణాల కోసం సూర్యుడి కోసం కళ్లు విప్పార్చి చూస్తుంటారు.