వినాయకుడి తొండం ఎటు వైపు తిరిగి ఉంటే మంచిదో తెలుసా?

0
104

ఇంకొన్ని రోజుల్లో గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. దాంతో ప్రజలు వాడ వాడల గణేషుడి మండపాలు ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ గణేషుడి విగ్రహం కొనేటప్పుడు కొన్ని విగ్రహాల తొండం ఎడమవైపునకు, కొన్ని విగ్రహాల తొండం కుడివైపునకు, మరికొన్నింటి తొండం నిటారుగా ఉండడం మనం గమనిస్తుంటాము.

దాంతో వినాయకుడి తొండం ఎటు వైపు తిరిగి ఉంటే మంచిదో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. వినాయశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాలు, చిత్రపటలు కొనడం వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. ఇలా తొండం ఎడ‌మ వైపుకు ఉన్న గ‌ణేషున్ని పూజిస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొల‌గిపోతుంద‌ట‌.

ఇంట్లో ఉన్న వారంద‌రి ఆరోగ్యం బాగుంటుంద‌ట‌. దీనికి తోడు గ‌ణేషుడి త‌ల్లి అయిన పార్వ‌తీ దేవి ఆశీస్సులు కూడా ఆ ఇంట్లోని వారంద‌రికీ ల‌భిస్తాయ‌ట‌. ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సంతోషం ఉంటుంద‌ట‌. అంతేకాకుండా గణపతి వాహనము ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా జాగ్రత్త పడాలి.