ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో దుర్యోద‌నుడ్ని ఆపిన అత‌ని సోద‌రుడు ఎవ‌రో తెలుసా

Do you know who is his brother who stopped Duryodhana during Draupadi undressing?

0
115

మహాభారతంలో ఎన్నో గొప్ప విష‌యాలు మ‌నం నేర్చుకోవ‌చ్చు. మ‌నిషి ఎలా ఉండాలి కోపం అహం అనేవి ఎలా ఆపుకోవాలి మంచి చెడు ఇలా అనేక విష‌యాలు భార‌తం తెలియ‌చేస్తుంది. ఇక ఎన్నో పాత్ర‌లు ఎంత చెప్పినా త‌క్కువ కాదు. అయితే ఇప్పుడు ఓ పాత్ర గురించి చెప్పుకోవాలి. కాని చాలా మందికి ఆ వ్య‌క్తి గురించి తెలియ‌దు. వికర్ణుడు అనే వ్య‌క్తి అతి కొద్ది మందికి మాత్ర‌మే తెలిసిన వ్య‌క్తి.

అత‌ను ఎవ‌రు అంటే దృతరాష్ట్రుడు తనయులు నూరుగురు కౌరవులలో ఒక్కడు.దుర్యోధనుడు చేస్తున్న త‌ప్పుని ప్ర‌శ్నించి అన్న‌ని ఈత‌ప్పు చేయ‌వ‌ద్దు అని కోరిన సోద‌రుడు. వికర్ణుడు సకల అస్త్ర విద్యలనూ ఔపోసన పట్టాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్య వంటి అతిరథుల ద‌గ్గ‌ర అన్ని విద్య‌లు నేర్చుకున్నాడు.
ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో సోద‌రా ఇలా చేయ‌వ‌ద్దు దీని వ‌ల్ల కురువంశానికి మ‌చ్చ వ‌స్తుందని కోర‌తాడు కాని క‌ర్ణుడు విక‌ర్ణుడిని ఆపుతాడు.

మ‌న‌వైపు అధ‌ర్మం ఉంది అని తెలిసినా యుద్దం చేస్తాడు. అన్న గెలుపు కోసం క‌ష్ట‌ప‌డ‌తాడు. చివ‌రి వ‌రకూ పోరాటం చేస్తాడు.కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజున వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు. చివ‌ర‌కు విక‌ర్ణుడు ప్రాణాలు వ‌దులుతాడు.