మీరు ఎప్పుడైనా గమనించారా పురుషుల షర్ట్ బటన్స్ కుడివైపు ఉంటాయి, అదే మహిళలకు మాత్రం షర్ట్ బటన్స్ ఎడమవైపు ఉంటాయి..మరి మహిళల కోసం తయారుచేసిన చొక్కాలోని బటన్ పురుషుల చొక్కాకు ఎందుకు వ్యతిరేకం ఉంటాయో అసలు మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ? దీని వెనుక ఓ కారణం ఉంది అది తెలుసుకుందాం.
గతంలో అంటే పాత రోజుల్లో చూస్తే మహిళలు కూడా గుర్రాలు ఎక్కి స్వారీ చేసేవారు, అప్పుడు వారి చొక్కాలు గాలికి ఎగిరేవి అందుకే వారికి ఆ సమయంలో ఎడమ వైపున గాజు బటన్స్ కుట్టేవారు. ఆనాటి నుంచి పెద్ద పెద్ద కంపెనీలు ఇదే ఫాలో అయ్యాయి.
చరిత్రలో మరో విషయం ఉంది.. నెపోలియన్ ఒక ప్రత్యేక రూట్లో నిలబడేవాడు. దీనిలో అతను చొక్కాను మరో చేత్తో సర్దుకునేవాడు. దీనిని కొందరు మహిళలు గేలిచేసేవారు, దీంతో నెపోలియన్ మహిళలను ఆపడానికి ఎడమ వైపున చొక్కాలో బటన్లు పెట్టమని ఆదేశించాడు. ఇక పురుషులు స్త్రీలకు బట్టలు ఎవరివి అని తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగకరం.