బైక్స్‌కు సైలెన్సర్‌ కుడివైపునే ఎందుకు ఉంటుందో తెలుసా?

0
104

సాధారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనానికి సంబంధించి అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. క్లచ్, బ్రేక్, రేస్, గేర్, సైలెన్సర్, డిస్క్ వంటి వాటిపై అవగాహన తప్పనిసరి. మరి సాధారణంగా అన్ని బైక్స్‌లో సైలెన్సర్‌ కుడివైపునే ఉంటుంది. మరి అది ఎడమ పక్క ఎందుకు ఉండకూడదు? కుడి పక్కనే ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం..

నిజానికి కుడి పక్కకి సైలెన్సర్‌ని పెట్టడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఎడమవైపు అందరూ నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సైలెన్సర్ పొగ కానీ సైలెన్సర్ కానీ ప్రమాదంగా మారకూడదని కుడి పక్కన పెడతారు.

అలానే చాలామంది మహిళలు, పెద్దవాళ్ళు ఒక పక్క కూర్చుంటూ ఉంటారు. అయితే అలా ఎడమపక్క కూర్చున్నప్పుడు సైలెన్సర్ కుడి పక్క ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

అలానే మనం బండి బ్రేక్ వేసి ఆపాలని అనుకున్నప్పుడు జనరల్‌గా ఎడమ పాదం ఫుట్ రెస్ట్ మీదకి ముందు వస్తుంది. దీంతో మనకి సైలెన్సర్ పోగ కానీ వేడిగా తగలడం కానీ జరగదు. అందుకే కుడి వైపుకు సైలెన్సర్‌ ఉంటుంది.

అదే విధంగా ఎడమ వైపు చైన్స్ స్ప్రాకెట్ ఉంటుంది. కుడి పక్కన సైలెన్సర్ పెడితే బరువు బ్యాలెన్స్‌ అవుతుంది. అందుకే సైలెన్సర్ కుడి పక్కకి ఉంటుంది.

అయితే ఎడమ పక్కకు ఉండకూడదు.. కుడి పక్కనే ఉండాలి అని రూల్‌ ఏం లేదు.. ఎందుకంటే స్పోర్ట్స్ బైక్స్‌కి రెండు పక్కల సైలెన్సర్లు ఉంటాయి. అలానే కొన్ని బండ్లకైతే సీట్ కింద కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా మాత్రం కుడి పక్కకు మాత్రమే ఉంటాయి.