ఊసరవెల్లి ఎందుకు రంగులు మారుస్తుందో మీకు తెలుసా?

Do you know why the chameleon changes colors?

0
99

ప్రకృతిలో మనకు ఎన్నో వింతలు, ఆకట్టుకునే ఘటనలు కనిపిస్తుంటాయి. మనం సహజంగా చాలా రకాల జంతువుల్ని చూస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని జంతువుల అయితే చాలా వింతగా ఉంటాయి. కొన్ని జంతువులు అవి చేసే శబ్దాలు వింతగా అనిపిస్తుంటాయి. అలాగే మరికొన్ని జంతువులు ప్రత్యేకతలు కలిగి ఉంటాయి.

అలా ఆశ్చర్యపరిచే జంతువుల్లో ఊసరవెల్లి కూడా ఒకటి. సాధారణంగా ఊసరవెల్లి రంగులు మారుస్తూ ఉంటుంది. అన్ని జంతువులు ఇలా ఊసరవెల్లిలా రంగులు మార్చలేవు. ఊసరవెల్లి ఎందుకు రంగులు మారుస్తోంది అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఊసరవెల్లి రంగులు మార్చడానికి గల కారణం అది శత్రువుల నుంచి తప్పించుకోవాలని చాలా మంది  అనుకుంటారు. కానీ నిజానికి అది నిజం కాదు. వివిధ కారణాల వల్ల ఊసరవెల్లి రంగులు మారుస్తోంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి ఊసరవెల్లి రంగులు మారుస్తోంది. దీంతో ఇతర ఊసరవెల్లిలకి సంకేతం ఇస్తుంది. పైగా ఒక ఊసరవెల్లి మరొక దానితో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి చర్మంలో ఉండే జీవకణాల్లో పలు యాంత్రిక నిర్మాణాల చర్యల వల్ల రంగులు మార‌డం జరుగుతుంది.

ఊసరవెల్లులు ఈ రంగుల మార్పులను ఎలా చేయగలుగుతాయంటే..ఊసరవెల్లి చర్మం యొక్క బయటి పొర పారదర్శకంగా ఉంటుంది. దీని క్రింద క్రోమాటోఫోర్స్ అని పిలువబడే ప్రత్యేక కణాలను కలిగి ఉన్న అనేక చర్మ పొరలు ఉంటాయి. క్రోమాటోఫోర్స్ వివిధ రకాల వర్ణద్రవ్యం యొక్క సంచులతో నిండి ఉంటాయి. లోతైన పొరలో మెలనోఫోర్స్ ఉంటాయి, ఇవి బ్రౌన్ మెలనిన్‌తో నిండి ఉంటాయి. ఆ పొర పైన ఇరిడోఫోర్స్ అని పిలువబడే కణాలు ఉన్నాయి ఇవి నీలం మరియు తెలుపు కాంతిని ప్రతిబింబించే నీలి వర్ణద్రవ్యం కలిగి ఉంటాయి. ఆ కణాల పైన లేయర్‌లుగా పసుపు మరియు ఎరుపు వర్ణద్రవ్యాలను కలిగి ఉండే శాంతోఫోర్స్, ఎరిత్రోఫోర్స్ ఉంటాయి.

ఊసరవెల్లులు తమ స్వంత శరీర వేడిని ఉత్పత్తి చేయలేవు కాబట్టి, వారి చర్మం యొక్క రంగును మార్చడం అనేది అనుకూలమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఒక మార్గం. ఒక చల్లని ప్ర‌దేశంలో ఉండే ఊసరవెల్లి మరింత వేడిని గ్రహించడానికి న‌ల్ల‌గా లేదా డార్క్ రంగులోకి మారుతుంది. అదేవిధంగా వేడిగా ఉండే స్థలంలో ఉన్న‌ ఊసరవెల్లి వేడిని త‌గ్గించుకునేందుగా లేత రంగులోకి మారుతుంది.