సాధారణంగా మహిళలు కను బొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటారు. కొంతమంది కనుబొమ్మలతో పాటు నుదిటి పైనా కూడా పెట్టుకుంటారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం కను బొమ్మల మధ్యలోనే బొట్టును పెట్టుకుంటారు. అయితే మహిళలు కనుబొమ్మల మధ్యే ఎందుకు బొట్టు పెట్టుకుంటారని ఎప్పుడైనా ఆలోచించారా..? కనుబొమ్మల పై కాకుండా ఇతర ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా..? అయితే బొట్టును కను బొమ్మల మధ్యే పెట్టుకొవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం..
కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకొవడం అనే సాంప్రదాయం ప్రాచీన కాలం నుంచే వస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ బొట్టును తప్పకుండా పెట్టుకోవాలి. అది కూడా కనుబొమ్మల మధ్య పెట్టుకోవాలి. అయితే ప్రాచీన కాలంలో మహిళలు, పురుషులు కను బొమ్మల మధ్య చాలా పెద్దగా.. బొట్టు ను పెట్టుకునే వారు. కాలం గడుస్తున్న కొద్ది బొట్టు సైజు తగ్గుతూ వస్తుంది. అయితే బొట్టు కను బొమ్మల మధ్య పెట్టు కోవడానికి కారణం ఎంటంటే..? మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం అని ఒకటి ఉంటుంది.
ఆ ఆజ్ఞా చక్రం ఎప్పుడూ వేడి పుట్టిస్తూ ఉంటుంది. అందుకు ఆ ప్రాంతంలో చల్లదనం ఉండాలనే ఉద్ధేశంతో ప్రాచీన కాలంలో కుంకుమ, పసుపు, భస్మం, చందనం, తిలకం, శ్రీచూర్ణం వంటి వాటిని పెట్టుకునే వాళ్లు. దాన్నే కొన్ని రోజుల తర్వాత బొట్టు అని పిలిస్తున్నారు. అలాగే బొట్టు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటే ముఖానికి అందాన్ని ఇస్తుంది. అలాగే ముఖానికి తేజస్సును ఇస్తుంది. అందుకే బొట్టును కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. అయితే బొట్టును నుదట గుండ్రంగా పెట్టుకోవాలా లేదా అడ్డంగా పెట్టుకోవాలా లేదా నిలువుగా పెట్టుకోవాలా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే బొట్టు అనేది వంశ ఆచారం ఆధారం గా నిలుగా, అడ్డంగా, గుండ్రంగా పెట్టుకుంటారు.