గంటలు తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త..ప్రాణాలకే ప్రమాదం

0
96

కరోనా మహమ్మారి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. ఆయా కంపెనీలు, ఉద్యోగులు ఇంటి నుండి పనికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు గంటలు తరబడి ల్యాప్ టాప్ ముందు కూర్చోవాల్సి వస్తుంది. దీనితో మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గంటలు తరబడి కూర్చొని పని చేస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు డిప్రెషన్ కు గురవుతారు. సుదీర్ఘ పని గంటలు శారీరక కదలికలు లేకుండా పని చేయడం వల్ల, సైకలాజికల్ సేఫ్టీని కలుషితం చేస్తాయని తెలుస్తుంది. దీనివల్ల ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

అయితే ఎక్కువ పని గంటలు కూర్చోడానికి కేటాయిస్తే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి అనారోగ్యానికి దారి తీస్తుంది. అయితే ఇలాంటి వారు మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ నీటిని తాగుతుండాలని సూచించారు. ఇలా చేయడం వల్ల కొద్దిమేర అనారోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.