మామూలు రోజులుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని అందరికి తెలుసు. అందుకే చాలామంది పెట్రోల్ బంక్‌కి వెళ్లడానికి బద్ధకంగా ఉండి ఒకేసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తారు. కానీ వేసవిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంటుందని చాలామందికి తెలియదు. అందుకే మీ వాహనాలకు అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ఎండాకాలంలో ఎప్పుడూ కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్, డీజిల్ కొట్టించకూడదు. దానివల్ల పేలిపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. చాలామంది పెట్రోల్ బంక్‌ల వద్ద మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతుంటారు. అలా చేయడం వల్ల వాటినుంచి వచ్చే రేడియేషన్ వల్ల వాహనాలు కాలిపోయే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా ఎండాకాలం పూర్తయ్యేవరకూ ప్రతి 15 రోజులకోసారి వాహనాలను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కార్లు, బైక్స్ ఎండలో ఎక్కువ సేపు పెట్టకూడదు. దానివల్ల పెట్రోల్, డీజిల్‌కి ఉండే మండే శక్తితో వాహనాలు కాలిపోయే అవకాశం ఉంది. వాహనాలలోడ్రైవింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇంజిన్ నుంచి ఎక్కువగా శబ్ధాలు వస్తుంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం.