తిరుపతికి డాలర్ శేషాద్రి పార్థీవ దేహం..ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు

Dollar Seshadri Parthiva's body to Tirupati..funeral this afternoon

0
82

డాలర్ శేషాద్రి మృతదేహం తిరుపతికి చేరుకుంది. ఓల్డ్ మెటర్నటీ ఆసుపత్రి రోడ్డులోని సిరిగిరి అపార్ట్ మెంట్ వద్ద డాలర్ శేషాద్రి పార్ధీవ దేహాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, డిప్యూటీ ఈఓ హరీంధ్రనాధ్, టీటీడీ హెచ్ డీపీపీ మెంబర్ వెంకటేశ్ శర్మ రిసీవ్ చేసుకున్నారు. అనంతరం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలకు సంబంధించి ఏర్పాట్లపై శేషాద్రి కుటుంబ సభ్యులతో పలు సూచనలు చేశారు ధర్మారెడ్డి. సిరిగిరి అపార్ట్మెంట్ లో ప్రజలు డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని దర్శించుకునేలా బ్యారీకేడ్లతో ఏర్పాట్లు చేయించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో శేషాద్రికి అంత్యక్రియలు జరుగుతాయని శేషాద్రి కుటుంబ సభ్యులు తెలిపారు.