దొంగ‌త‌నానికి వెళ్లి చేప‌ల పులుసు తిని అడ్డంగా దొరికిపోయాడు

దొంగ‌త‌నానికి వెళ్లి చేప‌ల పులుసు తిని అడ్డంగా దొరికిపోయాడు

0
110

అత‌ను ఓ దొంగ త‌న వృత్తి దొంగ‌త‌నం, ఇలా దొంగ‌త‌నాలు చేసుకుని ద‌ర్జాగా న‌గ‌దు దోచేస్తున్నాడు, ఆ న‌గదు బంగారంతో ఎంజాయ్ చేస్తున్నాడు, తాజాగా తమిళనాడు కన్యాకుమారి జిల్లాకు చెందిన సతీష్ అనే యువకుడు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి దూరాడు. అయితే ఇల్లు పెద్దదే అయినా నగలు, కానీ డబ్బు కానీ వేరే ఏమీ విలువైన వస్తువులేవీ దొర‌క‌లేదు.

అన‌వ‌స‌రంగా ఈ ఇంట్లో దొంగ‌త‌నానికి వ‌చ్చాను అని ఫీల్ అయ్యాడు, చివ‌రకు వంటి ఇంటి నుంచి చేప‌ల పులుసు వాస‌న వ‌చ్చింది …వెంట‌నే అక్క‌డ అన్నం చేప‌ల కూర తినేశాడు,ఇక ఫుల్లుగా నిద్ర వ‌చ్చేసింది, వెంట‌నే మేడ‌పైకి వెళ్లి ప‌డుకుండిపోయాడు.

ఇక తెల్ల‌వారినా లేవ‌లేదు, దీంతో య‌జ‌మాని ఇంటికి వ‌చ్చి చూసేస‌రికి ఇళ్లంతా చింద‌ర‌వంద‌ర‌గా ఉంది, వెంట‌నే సీసీ టీవీ చూశాడు అందులో దొంగ మేడ‌పైకి వెల్ల‌డం చూసి వెంట‌నే పైకి వ‌స్తే ఈ దొంగ నిద్ర‌పోతూ ఉన్నాడు, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చి స్ధానికుల సాయంతో ఆ దొంగ‌ని పట్టుకున్నాడు.
చివ‌ర‌కు జైలుకి వెళ్లాడు ఈ దొంగ‌.