ద్వేషం వ‌ద్దు- ప్రేమను పంచండి..వీధుల్లో కరపత్రాలు పంచుతున్న రిటైర్డ్ ప్రొఫెసర్

0
99

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమెను చూస్తే ఎవరో సాధారణ వ్యక్తి అనుకుంటారు. కానీ ఆమె ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ల‌క్నో యూనివ‌ర్శిటీకి మాజీ వైస్ చాన్స‌ల‌ర్ రూప్ రేఖా వ‌ర్మ. ఆమె వ‌య‌స్సు 79 ఏళ్లు. ఈ వయసులో ఎవరైనా ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆమె తన జీవితంలో విశ్రాంతికి చోటివ్వలేదు. ఇంట్లో తిని కూర్చోవడం కంటే..ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు నడుం బిగించింది.

కులం, మ‌తం, ప్రాంతం, ద్వేషంతో ఈ దేషాన్ని నింపొద్ద‌ని క‌ర‌ప‌త్రాల‌ను ఆయుధంగా మలుచుకొని ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మ‌తం ఎప్ప‌టికీ మందు లాంటిద‌ని కోరుతోంది. తానే స్వ‌యంగా పంపిణీ చేస్తూ ప్ర‌చారం చేయ‌డం విస్తు పోయేలా చేస్తోంది. పొద్ద‌స్త‌మానం అమెరికా జ‌పం చేసే వాళ్ల‌కు, ఈజీగా డ‌బ్బులు సంపాదించాల‌ని కోరుకునే య‌వ‌త‌కు, మ‌తం పేరుతో మ‌నుషుల్ని విభ‌జించాల‌ని అనుకునే వాళ్ల‌కు ఆమె ఓ చెంప పెట్టు లాంటిది.

ఆమె 1857 నాటి విప్లవం గురించిన క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె సామాన్యురాలు కాదు. 1857కి ముందు జ‌రిగిన స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ప్ర‌దేశ‌మే ఇప్ప‌టి ల‌క్నో చిన్ హ‌ట్ ప్రాంతం. ద్వేషం క‌ర్ర‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టండి. ఒక‌రినొక‌రు ప్రేమించుకోండి. దేశ ప్రేమికులారా ..ప్ర‌జ‌లారా భావోద్వేగాలకు లోను కాకుండా స‌మున్న‌త భార‌త దేశం గొప్ప‌ద‌ని అందులో రాసి ఉంది.

ఆమెను చూసిన వేలాది మంది ఆమె నిబ‌ద్ద‌త‌కు స‌లాం చేస్తున్నారు. మిమ్మ‌ల్ని చూశాక క‌ళ్ల వెంట నీళ్లు వ‌స్తున్నాయి. మీ ప్ర‌య‌త్నానికి వంద‌నం అని కొంద‌రు పేర్కొన్నారు. ఆమె దేశం అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతోంది. ద్ర‌వ్యోల్బ‌ణం దారుణంగా ఉంద‌న్నారు. దేశం వెనుక‌కు వెళుతోంది. దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ల‌క్నో యూనివ‌ర్శిటీలో త‌త్వ‌శాస్త్ర ప్రొఫెస‌ర్ గా ఉన్నారు. ఆ శాఖ విభాగానికి చీఫ్ గా ఉన్నారు. ఆ త‌ర్వాత వీసీగా చేశారు.