మనకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎంతో స్వచ్చమైన నీటిని తాగేందుకు అందిస్తున్న బావులు ఉన్నాయి, ఫిల్టర్ లో నీటికన్నా అవి బాగుంటాయి, మంచి రుచి ఉంటాయి, అయితే ఇప్పుడు కలుషితం అవుతున్న వాతావరణంలో ఇలాంటివి తక్కువగా కనిపిస్తున్నాయి, అయితే దూద్ బావి కూడా అలాంటిదే ..ఇది పురాతన మంచినీటి బావి, ఈ నీరు తాగితే చాలు ఏదైనా రోగం ఉన్నా నయం అవుతుంది అంటారు ,అందుకే బాటిళ్ల రూపంలో ఈ నీటిని తీసుకువెళతారు అందరూ.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలోని దూద్బావి ఉంది, ఇటు కార్లు బైకుల మీద వెళ్లేవారు కూడా ఈ నీటిని తీసుకుని తాగి వెళతారు, ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్స్ కంటే ఈ నీటి బాటిల్స్ ఎక్కువ తాగుతారు.
మొలంగూర్లో సైనికుల కోసం కాకతీయ రాజులు ఈ బావిని తవ్వించారట. ఈ బావి నీరు చాలా తీయగా, స్వచ్ఛంగా ఉంటాయి.
365 రోజులు బావిలో నీరు ఉంటాయి,ఈ నీళ్లను గుర్రపు బగ్గీల్లో హైదరాబాద్లోని నిజాం నవాబు కుటుంబానికి సరఫరా చేసేవారని ఆ నాటి చరిత్ర చెబుతోంది, ఎలాంటి మలినాలు ఉండవు, అంతేకాదు ఎలాంటి ఫ్లోరైడ్ ఆనవాళ్లు కనిపించవు.
ఈ నీటి గురించి తెలిసి సైంటిస్టులు శాంపిల్ చూశారు, ఈ నీటిలో స్వచ్ఛమైన అధిక లవణాలు పోషక పదార్థాలు చాలా ఉన్నాయని గుర్తించారు. ఈసారి మీరు వెళితే ఈ బావి నీరు టేస్ట్ చూడండి.