ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో చాలా ఆఫీసులు క్లోజ్ అయ్యాయి, ఆరునెలలుగా రెన్యువల్స్ కూడా పూర్తిగా నిలిచిపోయాయి, అయితే తాజాగా ఆధార్ కార్డుతో ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ను పునరుద్ధరించుకునే అవకాశం ఇస్తున్నారు.
ఇక వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఐటి మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా అన్ని రకాల సేవలను ఆన్ లైన్ లో ఇక పై మీరు పొందవచ్చు.
లైసెన్స్ పొందడం
లెర్నర్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ
ఆర్సి
డాక్యుమెంట్ అడ్రస్ మార్చడం ఈ సర్వీసులు ఆన్ లైన్ లొ పొందవచ్చు
ఆధార్ అథెంటికేషన్ తో ఇవి పూర్తి అవుతాయి.. మీరు రవాణాశాఖ వెబ్ సైట్లో దీనిని తెలుసుకోవచ్చు, అయితే 2018 నుంచి రవాణాశాఖకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లకి ఆధార్ తప్పనిసరి చేశారు.