ఈ ప్రపంచంలో అతి పెద్ద హోటల్ ఇదే ఎక్కడ ఉందంటే

ఈ ప్రపంచంలో అతి పెద్ద హోటల్ ఇదే ఎక్కడ ఉందంటే

0
108
ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద కట్టడాలు నిర్మాణాలు అంటే వెంటనే వినిపించే పేరు అరబ్ కంట్రీస్ …సో దుబాయ్ సౌదీ లో ఇలాంటి కట్టడాలు నిర్మాణాలు చాలా ఉన్నాయి… ఇక లగ్జరీ హోటల్స్ పెద్ద పెద్ద 7 స్టార్ హోటల్స్ కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి, అయితే మీరు ఎప్పుడైనా  ఆలోచించారా అసలు మన ప్రపంచంలో అతి పెద్ద హోటల్ ఎక్కడ ఉందో, ఎస్ ఇప్పుడు అదే చెప్పుకుందాం.
ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ ను మక్కాలోని సౌదీ సిటీలో నిర్మిస్తున్నారు. ఆతిధ్యం పర్యాటకం షాపింగ్ అంటే సౌదీ దుబాయ్ అనే చెబుతారు.. సో ఇప్పుడు సౌదీలో ఇది నిర్మిస్తున్నారు..అబ్రాజ్ కుడాయి దీని పేరు… ఇక మొత్తం దీనిని ఎలా డిజైన్ చేశారు అంటే.. మొత్తం 12 టవర్లలో 70 రెస్టారెంట్లను నిర్మిస్తున్నారు.
అలాగే 10 వేల గదులను నిర్మిస్తున్నారు. హోటల్ భవనం 4 టవర్లపై 4 హెలిప్యాడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక టవర్ లో అత్యధికంగా 45 ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. 30 ఫ్లోర్లతో మరో టవర్ నిర్మిస్తున్నారు. 233 బిలియన్ రూపాయలు ఖర్చు అవుతోంది, ఇక మరో రెండు సంవత్సరాలకు ఇది పూర్తి అవుతుంది అని తెలుస్తోంది.. మరో విషయం ఏమిటి అంటే ఇందులో 5 ఫ్లోర్లు కేవలం సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీకి మాత్రమే కేటాయించనున్నారు.