ఒక్కొక్కరిది ఒక్కో కథ..భావోద్వేగాల సమాహారం..టోటల్‌ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..!

0
133
బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఎంతోమంది సెలబ్రిటీలను 90 రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా బిగ్ బాస్ ఇంట్లో ఉంచి టాస్క్ లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రియాల్టీ షో నిన్న అనగా సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అయింది.  గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ లు ఎవరెవరు వస్తారు అనే విషయం చాలా వైరల్ గా మారుతుండగా ఎట్టకేలకు 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం జరిగింది.
ఇక ఆ కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయానికి వస్తే కార్తీకదీపం సీరియల్ నటి కీర్తి, నువ్వు నాకు నచ్చావ్ సినిమా పింకీ అలియాస్ సుదీప, సిరి బాయ్ ఫ్రెండ్ ప్రముఖ యూట్యూబ్ శ్రీహాన్, ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి, జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి, ప్రముఖ నటి శ్రీ సత్య, షార్ట్ ఫిలిమ్స్ హీరో అర్జున్ కళ్యాణ్, జబర్దస్త్ లేడీ కమెడియన్ గీతూ రాయల్, నటి అభినయశ్రీ, ప్రముఖ సీరియల్ నటి మెరీనా, ఆమె భర్త నటుడు రోహిత్, హీరో బాలాదిత్యాతో పాటు సీరియల్ నటి వాసంతి, షానీ సల్మాన్, వినయ సుల్తానా, ఆర్ జె సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి రావు, సింగర్ రేవంత్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. చూడాలి మరి ఇందులో  టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారో..!