ఇదేం దారుణం అతీత శక్తులు వస్తాయని కన్నబిడ్డలనే బలివ్వడానికి ప్లాన్ – కారం పూసి

ఇదేం దారుణం అతీత శక్తులు వస్తాయని కన్నబిడ్డలనే బలివ్వడానికి ప్లాన్ - కారం పూసి

0
106

ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢ విశ్వాసంతో ఇద్దరు కుమార్తెలను ఎంత దారుణంగా తల్లిదండ్రులు చంపారో తెలిసిందే, వారిద్దరూ ఉన్నత చదువులు చదువుకున్న వారు ఇలాంటి పని చేయడంతో అందరూ షాక్ అయ్యారు, ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు, అయితే ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది.. కాని ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే ఆ పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల నుంచి తప్పించుకున్నారు.

 

 

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యంలో ఈ దారుణమైన ఘటన జరిగింది.. రామలింగం రంజిత భార్యాభర్తలు. వీరికి దీపక్ కిషాంత్ సంతానం. చీరల వ్యాపారం చేస్తాడు ఈ ఇంటి పెద్ద, ఇక రామలింగం ఇందుమతిని రెండో వివాహం చేసుకున్నాడు, ఈ సమయంలో వీరి ఇంటికి ధనలక్ష్మి అనే మహిళ వచ్చేది.

 

ఇక మహిళలు ఇద్దరిని శివపార్వతుల్లా ఉన్నారు అని రామలింగం అనేవాడు, దీంతో ఆ మహిళలు ఇద్దరూ ధనలక్ష్మి, రంజిత వివాహం చేసుకున్నారు… మొత్తానికి పిల్లల సమక్షంలో వివాహం చేసుకున్నారు, వారిపై దారుణంగా ప్రవర్తించారు తల్లిదండ్రులు ధనలక్ష్మి. స్కూల్ కి పంపకుండా ఇంట్లో కష్టాలు పెట్టారు పనులు చేయించారు .. అతీతశక్తులు వస్తాయన్న నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, తండ్రి రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేసేవారు.

 

పిల్లల శరీరానికి కారం పూసి ఎండలో పడుకోబెట్టేవారు. వారితో శానిటైజర్ తాగించేవారు. ఇక ఈ దుర్మార్గులు బలి ఇవ్వాలి అని ప్లాన్ చేశారు, ఇది విన్న పెద్దకుమారుడు తమ్ముడ్ని తీసుకుని బయటకు వచ్చి తాతయ్య స్ధానికులకు ఈ విషయం చెప్పాడు. వారిని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు.