ఇదేం దారుణం ఆంటీ అన్నందుకు చితక్కొట్టేసింది

ఇదేం దారుణం ఆంటీ అన్నందుకు చితక్కొట్టేసింది

0
103

ఇదేం దారుణం పాపం ఓ యువతి, మరో మహిళని ఆంటీ అంది.. దీంతో ఆమె ఆ యువతిని చితక్కోట్టింది, ఏదైనా కామెంట్ చేస్తే తప్పు ఏదైనా నోరు జారితే తప్పు, ఆంటీ అంటే ఇలా కొడతారా అని అందరూ విమర్శలు చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్లోని ఎటాలో కరవాచౌత్ పూజా సామగ్రి కొనుగోలుకు ఓ మహిళ వచ్చింది, అయితే ఆ యువతి మరో యువతిని చితక్కొట్టింది.

ఇంతకీ ఎందుకు అంటే ఆ యువతి ఆమెను ఆంటీ అని పిలిచింది దీంతో ఒక్కసారిగా కోపంతో ఆమెని కొట్టేసింది..
సమీపంలో ఉన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువతిని…ఆంటీబారి నుంచి కాపాడారు.
ఒక దుకాణం దగ్గర పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు పలువురు మహిళలు నిలుచుని ఉన్నారు. ఇంతలో ఒక యువతి పక్కనే ఉన్న మహిళను ఇలా ఆంటీ అని పిలిచింది.

ఇక కోపంతో నన్ను ఆంటీ అంటావా అని కోపం తెచ్చుకుని ఆ సామాన్లు కింద పాడేసి పిడిగుద్దులు కొట్టింది, అయితే ఆమెకి 35 ఏళ్ల వరకూ ఉంటాయి అని అంటున్నారు, ఇలా ఆంటీ అంటే కొట్టేస్తావా అని కూడా విమర్శించారు, ఆమెపై కేసు నమోదు చేశారు, 35 ఏళ్లు వస్తే ఆంటీ అనకుండా పదహారేళ్ల బాలాకుమారి అని పిలవాలా అంటున్నారు జనం.