ఈ జేబు దొంగ ఆస్తులు తెలిస్తే మతిపోతుంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా

ఈ జేబు దొంగ ఆస్తులు తెలిస్తే మతిపోతుంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా

0
93

మనం రాత్రి అనక పగలన కష్టపడి సంపాదించిన డబ్బు కూడబెట్టి భద్రంగా ఉంచితే, దానిని దోచేసే గ్యాంగ్ లు ఉంటాయి..ఇలాంటి దొంగల ముఠా వెంటనే మన కష్టార్జితాన్ని సెకన్లలో దోచేస్తారు.. అయితే ఇలా పట్టుబడ్డ జేబు దొంగ ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే.

రైళ్లు టార్గెట్ గా చేసుకుని, చేతిలో చిన్న బ్లేడుతో సంచరిస్తూ, అందినంత దోచుకుంటుంటాడు. అతని పేరు థానేదార్ సింగ్ కుశ్వ అలియాస్ రాజు. వయసు 33 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా అర్ణి ప్రాంతానికి చెందిన వ్యక్తి.
మరి అతని ఆస్తులు చూద్దామా.

చందానగర్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నెలకు రూ. 30 వేలు అద్దె ఇస్తూ ఉంటున్నాడట
తన పిల్లలకు లగ్జరీ లైఫ్ ఇస్తున్నాడు
లక్షల రూపాయలు చెల్లించి స్కూల్లో చేర్పించాడు
కోట్లకు పడగలెత్తి లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టాడు
భార్యకు కిలోకు పైగానే బంగారు ఆభరణాలున్నాయి
ఇంటికి వెళ్లి చూస్తే నగదు రూపంలోనే రూ. 13 లక్షలు దొరికింది. దీంతో ఇవన్నీ చూసి పోలీసులే అవాక్కయ్యారు.
మొత్తం 400 నేరాలు చేశాడు. ఆగ్రాలో ఓ ఫ్లాట్ కూడా ఉంది.