ఇక్కడ మహిళలు 65 ఏళ్ల వరకూ పిల్లల్ని కంటారు – ఎక్కడో తెలుసా

ఇక్కడ మహిళలు 65 ఏళ్ల వరకూ పిల్లల్ని కంటారు - ఎక్కడో తెలుసా

0
128

సాధారణంగా వివాహం అయిన తర్వాత ఆ జంటలు దాదాపు ఓ రెండు సంవత్సరాలు లేదా ఓ ఏడాది గ్యాప్ తీసుకుని పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు… ఇక 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య అమ్మాయిలకి పిల్లలు పుడితే బాగుంటుంది అని వారికి అన్నీ తెలుస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు …వైద్యులు కూడా ఇది మంచి వయసు అని చెబుతారు, దీని వల్ల వారికి కూడా ఆలోచన బాగుంటుంది అన్నీ తెలుస్తాయి.

 

 

అయితే పిల్లలు లేక చాలా మంది ఎన్నో పూజలు చేస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు… అమ్మతనం ఎంతో గొప్పది మరి ఏ ప్రాంతంలో చూసుకున్నా 40 ఏళ్ల లోపు పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇక ఆ తర్వాత వయసు వారు పిల్లల కోసం ట్రై చేయవద్దు అని చెబుతారు వైద్యులు.

 

కాని ఈ తెగకు చెందిన మహిళలు 65 ఏళ్లలో కూడా పిల్లల్ని కంటారట, అయితే ఇది మన తాతల కాలం నాటి రోజులని గుర్తు చేస్తున్నాయి, మరి ఈ తెగ ఏమిటి వీరి ఆచారం ఏమిటి అనేది చూస్తే ..హుంజ తెగకు చెందిన స్త్రీ లు 65 ఏళ్లు వచ్చినా కూడా పిల్లల్ని కంటూఉంటారట.. వీరు ఏకంగా 165 సంవత్సరాలు బతుకుతాం అని భావిస్తారు.. అందుకే వీరు ఎంత మంది పిల్లలని అయినా కంటూ ఉంటారు.. మరి వీరు ఎక్కడ ఉంటారు అని అనుమానం వచ్చిందా..

 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో గిల్గిట్ బలుచిస్తాన్ పర్వతాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా ఈ తెగ వారు నివసిస్తున్నారు. ఇక్కడ చాలా మంది 100 సంవత్సరాలు బతుకుతున్నారు, అంతేకాదు వీరికి ఎలాంటి అనారోగ్యం రాదు.. సుమారు 90 వేల మంది జనాభా నివశిస్తున్నారు.