ఏనుగు ఘటన మరువక ముందే గర్భంతో ఉన్న ఆవుపై అదే తరహా దాడి

ఏనుగు ఘటన మరువక ముందే గర్భంతో ఉన్న ఆవుపై అదే తరహా దాడి

0
103

ఇటీవల కేరళలో ఏనుగుకి కొబ్బరికాయలో బాంబులు పెట్టి ఇవ్వడంతో, అది తిని దాని దంతాలకు దవడకు గాయం అయింది, ఆనొప్పితో అది చనిపోయింది, అయితే అది పైనాపిల్ కాదు అని కొబ్బరికాయ అని నిందితుల విచారణలో తేలింది, ఈ సమయంలో ఇలా ఏనుగు ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది.

ఓ ఆవు నోటిలో బాంబు పేలింది. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఉన్న ఝాందూత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో స్థానికంగా వైరల్గా మారింది. ఇలా ఓ వ్యక్తి తన ఇంటిపక్కన వ్యక్తి నా ఆవుపై ఇలా దాడి చేశాడు అని తెలిపాడు.

తన ఇంటి పొరుగున ఉన్న నందలాల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడదని సింగ్ ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత నందలాల్ పారిపోయాడని తెలిపాడు. నోటిలో బాంబు పేలడంతో ఆవు నోటి నుంచి తీవ్రంగా రక్తం కారుతోంది.దీంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు, అతనికోసం వెతుకుతున్నారు, దానికి ఆహరంలో బాంబు పెట్టి ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పుడు గర్భంతో ఉంది ఆ ఆవు.