ఇలా కూడా దొంగ‌త‌నం చేస్తారా త‌స్మాత్ జాగ్ర‌త్త

ఇలా కూడా దొంగ‌త‌నం చేస్తారా త‌స్మాత్ జాగ్ర‌త్త

0
102

శానిటైజ‌ర్ ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు ..ఈ క‌రోనా రాక‌ముందు పెద్ద‌గా దీనిని ఉప‌యోగించ‌లేదు, ఇప్పుడు చాలా మంది శానిటైజ‌ర్లు వాడుతున్నారు. ఇక ఏం ముట్టుకున్నా క‌చ్చితంగా శానిటైజ‌ర్ వాడుతున్నారు.ఇటీవల కొంత మంది చోరీగాళ్లు తెలివిగా ఆలోచించారు.

చేతులకు శానిటైజర్ రాసుకొని కిరాణ షాపులో చోరీకి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని దౌల్‌పూర్లో ఇది చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న గురించి తెలిసి అంద‌రూ షాక్ అయ్యారు, ఇక్క‌డ రెండు షాపుల్లో దొంగ‌త‌నం జ‌రిగింది.

త‌లుపులు మూసివేసి ఉండ‌గా సామ‌న్లు తీసుకువెళ్లారు..ఉదయాన్నే యజమాని తలుపు తెరిచి చూడగా దొంగతనం విషయం బయటపడింది. దొంగ‌లు చేతులకు శానిటైజర్ రాసుకొని రూ. 5 వేల నగదుతో పాటు నిత్యావసరాలు ఎత్తుకెళ్లారని గుర్తించారు. అంతేకాదు అక్క‌డ డ్రింకులు స్నాక్స్ తో పార్టీ చేసుకున్నార‌ని సుమారు ల‌క్ష స‌రుకు ఎత్తుకెల్లారు అని గుర్తించారు.