ఇలాంటి పరిస్దితి ఎవరికి రాకూడదు బిడ్డ తండ్రి ఆవేదన

ఇలాంటి పరిస్దితి ఎవరికి రాకూడదు బిడ్డ తండ్రి ఆవేదన

0
129

ఈ వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది, 14 రోజులకి లేదా 20 రొజులకి కొందరికి నెల రోజులకి ఈ వైరస్ లక్షణాలు తెలుస్తున్నాయి, దీంతో ఎవరి నుంచి ఈ వైరస్ సోకుతుందో అనే భయం మాత్రం అందరికి కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల హృదయ విషాదకర సంఘటనలను చూడాల్సి వస్తోంది.

హనీఫ్ – వాజీద్ అలీ దంపతులకు వివాహమైంది. హనీఫ్కు గతేడాది ఓ బిడ్డ పుట్టి చనిపోగా.. రీసెంట్గా మళ్లీ గర్భం దాల్చింది. దీనితో దంపతులిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇక హనీఫ్ కు ఇటీవల జ్వరం వచ్చింది, ఆమెకు కరోనా పరీక్షలు చేశారు ఫలితాల్లో ఆమెకు కరోనా అని తేల్చారు. కాని అంత ప్రమాదం లేదు, పెద్దగా లక్షణాలు లేవు అని ఇంటికి పంపారు.. మెడిసన్స్ ఆమె వాడుతోంది.

ఇలా గర్భవతి అయిన ఆమెకు మూడు రోజులకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది, వెంటనే ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు, ఆమెకి ముందు సర్జరీ చేసి బాబుని బయటకు తీశారు, ఈ సమయంలో వైరస్ బాబుకి వస్తుంది అని భయపడి, బాబుని వేరే వార్డ్ కి తరలించారు, రెండు రోజులకి కోలుకుంది, బిడ్డ ఫోటోలు మాత్రమే చూపించారు, ఆమె ఆనందించింది, తాకలేదు కాని తన బిడ్డని ఫోటోలో చూసుకుంది, కాని మరో రెండు రోజుల్లో పరిస్దితి విషమించి ఆమె చనిపోయింది. ఆ చిన్నారిని తండ్రి చూసి కన్నీరు పెట్టుకున్నాడు, నిజంగా విషాదకరమైన సంఘటన ఇది, ఇక చిన్నారికి ఆ తండ్రికి వారి కుటుంబానికి మొత్తం కరోనా పరీక్షల్లో నెగిటీవ్ వచ్చింది.