తాజాగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు పరుగున వచ్చాడు, సార్ నా నగదు పోయింది సార్ అని అన్నాడు, దీంతో స్టేషన్ లో ఎస్పై ఎంత పోయింది అని అడిగాడు లక్ష సార్ అన్నాడు, ఎలా పోయింది అంటే నా నగదు డ్రా చేశారు సార్ అన్నాడు, నీ నగదు ఎలా డ్రా చేశారు అంటే ? ఎవరో దొంగ ఏటీఎం సెంటర్ నుంచి నగదు డ్రా చేశాడు అన్నాడు, నీ కార్డ్ పాస్ వర్డ్ ఎవరికి చెప్పావు అని అడిగితే,
ఓ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు, అతను పరసులో తన రెండు బ్యాంకు కార్డ్ లు పెట్టుకున్నాడు, వాటి వెనుక ఆ ఏటీఎం పాస్ వర్డ్ రాసుకున్నాడు , లాక్ డౌన్ వేళ కూరగాయలకు వెళ్లిన సమయంలో అతని పరసు కొట్టేశాడు, వెంటనే 20 నిమిషాలకే అతని కార్డుల నుంచి లక్ష డ్రా చేశాడు దొంగ.
దీంతో పోలీసులు షాక్ అయ్యారు, ఎవరైనా ఇలా కార్డులమీద పాస్ వర్డ్ రాసుకుంటారా అని ప్రశ్నించారు, చివరకు సీసీ కెమెరాల్లో చూస్తే అతను ముఖానికి కూడా మాస్క్ కట్టేసుకుని తీసుకున్నాడు, ఆ ఏరియాల్లో అతను నడిచి వెళ్లినది పరిశీలిస్తున్నారు పోలీసులు, ఇది పంజాబ్ లో జరిగింది, దీంతో పోలీసులు బయటకు వెళ్లిన సమయంలో పర్సులు ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతున్నారు.