ఏపీలో నేటి నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్ ప్రారంభం

Engineering‌ Counseling starts today at AP

0
270

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌తో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లౌన్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. నేటి నుంచి ఈనెల 30 వరకు విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

ఈనెల 26 నుంచి 31 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. నవంబర్‌ 6 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. నవంబర్‌ 10న విద్యార్థులకు సీట్లు అలాట్‌ చేస్తామన్నారు. అదేవిధంగా నవంబర్‌ 15 తేదీలోపు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని, అదే రోజునుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.