ఈ రెండు శనీశ్వరాలయాల్లో పూజలు చేసుకుంటే శని బాధలు దూరం

ఈ రెండు శనీశ్వరాలయాల్లో పూజలు చేసుకుంటే శని బాధలు దూరం

0
90

జాతకం ప్రకారం శని ప్రభావం ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అందుకే శనిదోషం ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి..
ఎక్కువగా కాళ్ళకు సంబంధించినవి, ప్రమాదాలు, పనులలో ఆటంకాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. అలా అని శనిశ్వరుడ్ని ఏనాడు తిట్టకూడదు.. దూషణ చేయకూడదు, మనం ఓర్పుగా ముందుకు సాగాలి.

మహారాష్టల్రోని శని సింగణాపూర్ , ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మందపల్లి శనికి సంబంధించిన ప్రముఖ క్షేత్రాలుగా ప్రసిద్ధి. శని బాధలనుండి నివారణ కోసం భక్తులు ఎక్కువగా ఈ క్షేత్రాలకు వెళ్లి పూజలు చేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శనివారం ఇక్కడకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.

త్రయోదశి తిథి కలిసివచ్చిన శనివారం భక్తులు పెద్త ఎత్తున ఆలయానికి వస్తూ ఉంటారు, ఇక్కడ ప్రతీ శనివారం వేల సంఖ్యలో భక్తులు వచ్చి శని పూజలు చేయించుకుంటారు, అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తులు వస్తారు, మరి మీరు కూడా ఈ దేవాలయాలు దర్శించి మీ బాధలు తొలగించుకోండి.