ఈ వ్యక్తికి షాక్ ఇచ్చిన పక్షి వీడియో వైరల్ – మీరు చూసేయండి

ఈ వ్యక్తికి షాక్ ఇచ్చిన పక్షి వీడియో వైరల్ - మీరు చూసేయండి

0
103

మనం జంతువులని ఎంత ప్రేమగా చూస్తే అవి మనల్ని అంత ప్రేమగా చూస్తాయి… కాదని తేడాగా వాటిపై కోపం ద్వేషం చూపిస్తే దానికి మించి అవి కూడా చూపిస్తాయి.. కుక్క అయినా ఆవు అయినా ఏ జంతువులు అయినా అంతే, మనం పెంచుకునే సమయంలో వాటిపై జాలి ప్రేమతో చూడాలి.. కొందరు ఇలా జంతువులని పక్షులని ఏడిపిస్తూ ఉంటారు. వాటిపై

రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు.

 

 

వాటిని హింసిస్తూ రాక్షసానందం పొందుతుంటారు.. పాపం కొంచెం ఆహారం వేస్తే అవి మన దగ్గరే ఉంటాయి అయితే వాటిని నీరు ఆహారం కూడా ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉంటారు, తాజాగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి పక్షికి ఆహారం అందివ్వబోయాడు.

 

సముద్రం ఒడ్డున ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు, అక్కడ పక్షులు ఎగురుతున్నాయి. పక్షికి ఆహార పదార్థం అందివ్వాలని అనుకున్నాడు. చిన్నపాటి ఆహార పదార్థాన్ని నోటిలో పెట్టుకుని కిందకు వంగాడు.. పక్షుల్ని పిలిచాడు వస్తాయి తింటాయి అని వీడియో తీద్దాం అని అనుకున్నాడు… కానీ ఓ పక్షి అది ముట్టుకోకుండా రెట్ట వేసి పారిపోయింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. చేతిలో వేసి పట్టుకుంటే బాగుండేది ఇలా వెరైటీగా ప్రయత్నించి ఇప్పుడు వైరల్ అయ్యాడు ఈ వ్యక్తి.

 

ఈవీడియో మీరు చూసేయండి