బ్యాండ్ తో ఊరేగింపులో పెళ్లికొడుకు… కారు ఎదురుగా మొద‌టి భార్య ? సీన్ రివ‌ర్స్

బ్యాండ్ తో ఊరేగింపులో పెళ్లికొడుకు... కారు ఎదురుగా మొద‌టి భార్య ? సీన్ రివ‌ర్స్

0
87

అక్క‌డ పెళ్లి కొడుకు ఇంట పెళ్లి సంద‌డి… బంధువులు స్ధానికులు ఫ్రెండ్స్ అంద‌రూ వ‌చ్చారు, ఇంత‌కీ అత‌ను సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు…బంధువులంతా కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ వరుని మొదటి భార్య పోలీసులతో సహా ఎంట్రీ ఇచ్చింది.

దీంతో అంద‌రూ షాక్ అదేమిటి పెళ్లి చేసుకోవ‌డానికి వెళుతుంటే మొద‌టి భార్య రావ‌డం ఏమిటి అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు..తనను ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడని, తనను శారీరకంగా వేధింపులకు గురిచేశాడని, గర్భస్రావం కూడా చేయించాడని ఆమె ఆరోపించింది.

వరుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెళ్లి ఊరేగింపు ఆగిపోగా, పెళ్లికి వచ్చినవారంతా ఈ ఘటనతో విస్తుపోయారు.యూపీలోని మంగళపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లాల్జీ కా పూర్వా గ్రామంలో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌. అత‌ను 2015లో ఫేస్ బుక్ ద్వారా ఓ యువ‌తితో ప‌రిచ‌యం పెంచుకుని 2018 లో పెళ్లి చేసుకున్నాడు, దీంతో అత‌ను నిజం ఒప్పుకున్నాడు. అత‌నిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.