హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో పలు పీజీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ..అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 21 వరకు గడువును పొడిగించారు. ఆలస్య రుసుంతో ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ ఏడాది పలు నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందులో ఎంఎఫ్‌ఏ (మాస్టర్స్ ఇన్ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్), ఎంఏ (చరిత్ర, టూరిజం) కోర్సులు ఉన్నాయి. ఎంఫిల్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. వివరాలకు www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్‌సైట్లను చూడాలని సూచించారు.