Breaking: జర్నలిస్టు అక్రిడెషన్ కార్డుల గడువు పొడిగింపు

0
99

జర్నలిస్టు అక్రిడెషన్ కార్డుల వ్యాలిడిటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 31తో అక్రిడెషన్ కార్డుల గడువు ముగుస్తుంది. కానీ సాంకేతిక కారణాల వల్ల రెన్యూవల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్రిడెషన్ కార్డుల వ్యాలిడిని జూన్ 30 వరకు పొడిగిస్తునట్టు సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2021 డిసెంబ‌ర్ 31వ తేదీతో మీడియా అక్రిడేష‌న్ల గ‌డువు ముగిసింది. తర్వాత ఈ గ‌డువును మ‌రో 3 నెల‌ల‌ (31-03-2022) వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మరో 3 నెలలు గడువు పెంచడం గమనార్హం.