ఫేస్ బుక్ లవర్ తో భార్య జంప్… భర్త పోలీసులకు ఫిర్యాదు…

ఫేస్ బుక్ లవర్ తో భార్య జంప్... భర్త పోలీసులకు ఫిర్యాదు...

0
95

ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఒక వ్యక్తితో వివాహిత లేచిపోయింది… ఈసంఘటన తెలంగాణలో జరిగింది… వికారాబాద్ తాండూరుకు చెందిన విక్రమ్ గౌడ్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన అనితను వివాహం చేసుకున్నాడు… వీరిద్దరికి వివాహం అయి తొమ్మిది సంవత్సరాలు అయినా పిల్లలు లేరు…

అయితే పెద్దగా చదువుకోని అనిత ఫేస్ బుక్ లో ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.. రోజు గంటల తరబడి అతడితో ఆన్ లైన్ లో స్పెండ్ చేసేది… ఈక్రమంలో భర్త మందలించినా కూడా ఆమె పట్టించుకునేదికాదు.. ఈక్రమంలో ఆమె గత నెల 26 నుంచి కనిపించకుండా పోయింది…

బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటుందని అనుమానంతో భర్త వారి ఇంటికి వెళ్లి చూశాడు అక్కడ కూడా లేదు… దీంతో భర్త ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను చెక్ చేశాడు… అయితే ఆమె అకౌంట్ ను క్లోజ్ చేసింది.. దీంతో గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…