వన్ ఆర్ నన్ కాదు, ఇద్దరు కాదు ఇక పై ముగ్గుర్ని కనొచ్చు

Family planning Relaxation in china

0
92

 

చైనా పేరు వినగానే గంపెడు జనాభా ఉన్న దేశంగా మనందరికి మతికి వస్తది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశంగా చైనా గుర్తింపు పొందింది. అలాంటి దేశంలో నేడు జననాల రేటు ప్రమాదకరంగా తగ్గిపోతున్నది. దానికి కారణం రోగాలు, నొప్పులతో చనిపోయి, ఇంకోటో కాదు… అక్కడి ప్రభుత్వ విధానాలే. అందుకే చైనా జనాభాను ఉత్పత్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటినుంచి ముచ్చటగా ముగ్గురు పిల్లల్ని కనొచ్చు అని అక్కడి ప్రజలకు వెసులుబాటు ఇచ్చింది.
చైనా కమ్యూనిస్టు దేశం 1949లో స్వాతంత్ర్యం వచ్చింది. అక్కడ జనాభా ఎక్కువ, దీంతో అంతమందికి తిండిపెట్టాలంటేనే కష్టపడాల్సిన పరిస్థితుల్లో జనాభాను కంట్రోల్ చేసేందుకు స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అప్పుడే వన్ ఆర్ నన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఒక్కరినే కనాలి. లేదంటే కనకూడదు అనేది తొలినాళ్లలో తీసుకొచ్చిన విధానం. ఆ విధానం దశాబ్దాల పాటు సాగింది. తర్వాత చైనా జననాల రేటు తగ్గుతూ వస్తున్నట్లు ఆ దేశం గుర్తించింది. తర్వాత 2016లో వన్ ఆర్ నన్ విధానాన్ని ఉపసంహరించి ఇద్దర్ని కనొచ్చు అని దేశ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఇద్దరిని దాటరాదని హుకూం జారీ చేసింది.


రోజులు మారుతున్న కొద్దీ… చైనాలో వృద్ధ జనాభా పెరిగి… జననాల రేటు ఘోరంగా తగ్గిపోయి యువతరం లేకుండాపోయే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. 40 కోట్ల జననాలను ఇది అడ్డుకుందని అక్కడి అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో మళ్లీ ఇప్పుడు తాజాగా ముగ్గుర్ని కూడా కనొచ్చు అంటూ చైనా ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు ఇచ్చింది.
చైనాలో పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన డేటా మే నెలలో వెలువడింది. దేశ జనాభా వృద్ధి చాలా మందగమణంలో ఉందని అందులో తేలింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్లకు చేరిందని క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది నుంచి అందులో తగ్గుదల నమోదు కావొచ్చని వెల్లడైంది. దీంతో కార్మిక శక్తి లభ్యత తగ్గిపోవచ్చని, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యోంనే కుటుంబనియంత్రణపై ఉన్న ఆంక్షలు ఎత్తేవేయాలన్న డిమాండ్లు ముందుకొచ్చాయి. అయితే కుటుంబ నియంత్రణ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ అంగీకరించలేదు. కానీ మూడో శిశువును కనేందుకు జంటలకు అనుమతించింది.
అయితే రెండో సంతానాన్ని పొందేందుకు 2016లో అనుమతించినప్పటికీ చైనాలో అనేక జంటలు దీనిపై ఆసక్తి చూపలేదు. అతి కొద్ది మంది మాత్రమే రెండో శిశువును కన్నారు. ఇప్పుడు మూడో బిడ్డకూ అనుమతించినందున పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.