కూతురు చేసిన పనికి పోలీస్ స్టేషన్ లో తండ్రి ఛీ ఛీ

కూతురు చేసిన పనికి పోలీస్ స్టేషన్ లో తండ్రి ఛీ ఛీ

0
114

అబద్దాలతో తల్లిదండ్రులను మోసం చేయాలి అని చూస్తున్నారు కొందరు, అలాంటి కేసే ఇది కూడా..బాయ్ ఫ్రెండ్ తో ఆమె షికారుకి వెళ్లింది అయితే రావడానికి లేట్ అయింది… దీంతో ఇంట్లో నిజం చెబితే తండ్రికి తల్లికి అనుమానం వస్తుంది అని అబద్దం చెప్పింది, తనని కిడ్నాప్ చేశారని తాను తప్పించుకుని వచ్చాను అని తండ్రికి తల్లికి చెప్పింది. దీంతో వారు కంగారు పడి తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు కూపీ లాగారు.. కాలేజీలో ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడకు తీసుకువెళ్లి చూపించింది.. చివరకు వారికి ఆమె చెప్పే సమాధానాలు పొంతనలేనివిగా ఉన్నాయి.. దీంతో సీసీ టీవీ ఫుటేజ్ ని తీశారు పోలీసులు.. దీనిలో ఆమె తన ప్రియుడితో బైక్ పై వెళ్లడం స్పష్టంగా కనిపించింది.

దీంతో పోలీసులు ఆమెపై ఫైర్ అయ్యారు.. పనిలేదు అనుకుంటున్నావా అని విమర్శించారు.. తల్లిదండ్రులు తిడతారు అని ఇలా అబద్దం చెప్పాను అని చెప్పింది ఆమె.. దీంతో ఆమె తండ్రికి షాకైనంత పని అయింది.. తన కూతురు అందరి కూతురిలా కాదు అనుకున్నాను, వారి కంటే ఎక్కువ అని తెలుసుకున్నాను అని కేసు వాపస్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు ఆమె తండ్రి.