తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా కూతురికి పెళ్లి తర్వాత ఏమైందంటే

తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా కూతురికి పెళ్లి తర్వాత ఏమైందంటే

0
113

కూతురు పెళ్లి చేయాలి అని తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రి అప్పుడే చనిపోతే నిజంగా ఏ కూతురికి ఇలాంటి కష్టం రాకూడదు అని అందరూ అనుకుంటారు ..తండ్రి కూతురిని తన ప్రాణంలా చూసుకుంటాడు.. మరి అలాంటి తండ్రికి ఏమైనా జరిగితే ఏ కూతురైనా తట్టుకుంటారా.

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఓ దారుణం జరిగింది. తండ్రి మరణించిన విషయాన్ని కుమార్తెకు చెబితే, ఆమె వివాహానికి అంగీకరించదన్న కారణంతో, చెప్పకుండానే పెళ్లిని జరిపించారు కుటుంబ సభ్యులు. దీంతో ఆమె కన్నీరు మున్నీరు అవుతోంది.. యస్దానీ బాషా చిరు వ్యాపారి, తన కుమార్తె వివాహాన్ని 22న నిర్ణయించారు, ఆ సమయంలో అతనికి అనారోగ్యం చేసింది.. ఈ సమయంలో ఆయనకు అక్కడ చికిత్స సరిపోక చెన్నై తీసుకువెళ్లారు.

కూతురుకు వివాహానికి కొన్ని గంటల ముందు ఆయన కన్నుమూశారు. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు, తండ్రి లేడన్న విషయాన్ని సైరాబానుకు చెప్పకుండానే వేడుకను ముగించారు. ముందు చెబితే ఆమె పెళ్లి చేసుకోదు అని చెప్పలేదు.. కాని ఆమెకు పెళ్లి అయిన తర్వాత విషయం చెప్పారు. దీంతో ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు.