ఈ వ్యక్తి పేరు ఉజ్వల్ అతని తండ్రి మున్సిపల్ డిపార్ట్ మెంట్లో వర్క్ చేస్తున్నాడు, మరి లాక్ డౌన్ వేళ వారు వర్క్ చేయాల్సిందే.. అందుకే వారికి పర్మిషన్ ఇస్తున్నారు, అయితే ఆ తండ్రి కార్డు తీసుకుని అతని కొడుకు రాత్రి సమయంలో బయటకు వచ్చాడు, అయితే మెయిన్ రోడ్ పై బారీ గేట్ తీసుకుని బైక్ పై ముందుకు వచ్చాడు.
వెంటనే పోలీస్ కానిస్టేబుల్ అతనిని ఆపాడు, చేబులో ఉన్న కార్డు చూపించాడు. అయితే ప్రభుత్వం తరపున ఇచ్చిన కార్డు సంతకం కనిపిస్తున్నాయ కదా అని పెద్ద పరిశీలించకుండా వెళ్లిపో అన్నాడు, అయితే అక్కడ ఉన్న ఉన్నత స్ధాయి పోలీస్ అధికారి ఎవరు ఎక్కడకు వెళుతున్నాడు అని మళ్లీ ఆపారు.
ఈ లోపు బండి ఆపి కార్డ్ చూపించలేదు, దీంతో అనుమానంతో కార్డ్ చూపించు అన్నాడు, అది తన తండ్రి కార్డ్ అని అబద్దం చెప్పాడు, దీంతో వెంటనే ఆకానిస్టేబుల్ ని కూడా ఉన్నత అధికారి మందలించాడు, సరిగ్గా పరిశీలించరా అని అన్నారు, వెంటనే ఆ యువకుడు మోసం చేయడంతో స్టేషన్ కు తీసుకువెళ్లి కోటింగ్ ఇచ్చారు, ఇంతకీ అతను బయటకు వచ్చింది బంగాళదుంప చిప్స్ కోసమట, తండ్రి స్టేషన్ కు వచ్చి మరోసారి జరగదు అని చెప్పి కుమారుడ్ని తీసుకువెళతా అన్నాడు, అయినా అతనిపై కేసు ఫైల్ చేశారు, ఫేక్ కార్డులు అబద్దాలు చెబితే వదలం అంటున్నారు పోలీసులు.