చీటికి మాటికి కోపం తెచ్చుకుంటుంటారు కొంతమంది… ఆ సమయంలో ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి అందుకే అంటారు… కోపం చికాగు వచ్చిన సమయంలో కాసేపు అంకేలను లెక్కబెట్టడం లేదా అక్కడ నుంచి వెళ్లి పోవడం చేస్తే సమస్య కాస్త తగ్గుముఖం పడుతుందని…
అయితే దీన్ని ఫోలో అవ్వక కోపంలో దాడికి పాల్పడుతున్నారు కొందరు… తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది… తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది…
దీంతో కన్న తండ్రిని కొడుకు కర్రతో కొట్టి చంపాడు ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది… కుటుంబ కలహాలతో తండ్రిని కొడుకుకర్రతో కొట్టి చంపాడు.. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు…