తండ్రి జేబులో గుట్కా తిన్న చిన్నారి త‌ర్వాత ఏమైందంట

తండ్రి జేబులో గుట్కా తిన్న చిన్నారి త‌ర్వాత ఏమైందంటే

0
97

చాలా మందికి గుట్కా తినే అల‌వాటు ఉంటుంది, ఇలా గుట్కా తినే వారు పిల్లల చేత కూడా అవి తెప్పించుకుంటారు.. కిరాణా పాన్ షాపుల్లో అవి దొరుకుతూ ఉంటాయి, ఈ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి ఫార్మా కంపెనీలో ప్యాకింగ్ మిష‌న‌రీ ద‌గ్గ‌ర టెక్నిషియ‌న్ గా ప‌నిచేస్తున్నా‌డు, అయితే అత‌నికి ఇలా గుట్కా తినే అల‌వాటు ఉంది.

ఇంటికి డ్యూటీ నుంచి వ‌చ్చి ష‌ర్ట్ హ్యాంగర్ కి త‌గిలించాడు.. త‌న మూడేళ్ల కొడుకు ఇంటిలో ఆడుకుంటూ ఉన్నాడు, ఈ స‌మ‌యంలో గుట్కా కింద ప‌డింది, ఆ చిన్నారి అది తెలియ‌క తినే వ‌స్తువు అని తిన్నాడు, వెంట‌నే ఏడుపుతో వాంతులు చేసుకున్నాడు.

వెంట‌నే గుర్తించి గుట్కా తిన్నాడు అని భావించి ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.. లేక లేక 8 ఏళ్ల‌కు పుట్టిన బిడ్డ దీంతో డాక్ట‌ర్లు బాబు అప‌స్మార‌క స్దితికి వెళ్లాడు అని చెప్పి 12 గంట‌ల త‌ర్వాత మెలకువ వ‌చ్చాక ట్రీట్మెంట్ పూర్తి అయ్యాక త‌ల్లిదండ్రుల‌కి సేఫ్ అని చెప్పారు..

చూశారుగా ఆ చిన్నారి క్షేమంగానే ఉన్నాడు, మీ చెత్త అల‌వాట్లు వ‌ల్ల పిల్ల‌లు తినే వ‌స్తువు అనుకుని తింటారు, పిల్ల‌ల‌ని జాగ్ర‌త్త‌గా చేసుకోవాలి, అలాగే మీరు ఇలాంటి అల‌వాట్లు ఉంటే అవి ఇంటి బ‌య‌ట చూసుకోవాలి అని డాక్ట‌ర్లు చెబుతున్నారు.