స్కూల్ స్టూడెంట్స్ కు పండగే..ఏకంగా 22 రోజులు దసరా హాలీడేస్!

0
95

సాధారణంగా పండుగ అంటే ఒక్కరోజో, రెండ్రోజులో స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ఇస్తారు. ఇక దసరా, సంక్రాంతి వంటి పండుగలకు వారం నుండి 10 రోజులు పాఠశాలలకు సెలవులు ఇస్తారు. కానీ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దుర్గాపూజ నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కార్ సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కార్యాలయాలకు ఈ సెలవులు అందుబాటులో ఉంటాయని, ఆ రోజుల్లో కార్యకలాపాలు జరగవని ఆదేశాల్లో వెల్లడించింది. అంతేకాకుండా దుర్గాపూజ జరిగే నెలలో 22 రోజులు సెలవులు తీసుకొనే వెసులుబాటు కల్పించింది.

కాగా.. 34 పబ్లిక్ హాలీడేస్ తో ఒడిశా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జార్ఖండ్ లో 33 రోజులు, అసోం, హిమాచల్ ప్రదేశ్ 32 రోజులు, తెలంగాణ, పశ్చిమ బంగాల్ 28 సెలవులు కలిగి ఉన్నాయి. అయితే పశ్చిమ బంగాల్ లో ఈ 28 పబ్లిక్ హాలీడేస్ తో పాటు దసరా, దుర్గాపూజ సందర్భంగా ఇస్తున్న సెలవులు అదనం. దేశంలో అతి తక్కువ పబ్లిక్‌ హాలిడేస్‌ ఉన్న రాష్ట్రం ఢిల్లీగా ఉంది. ఇక్కడ కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 15 రోజులతో బిహార్‌ రెండో వరసలో నిలిచింది. వీటి తర్వాత కర్ణాటక (16) ఉంది.