Video: చిరుతపులి-కొండచిలువ మధ్య భీకర పోరు..నెట్టింట వీడియో వైరల్

0
98

చిరుత పులి ఎలాంటి జంతువునైనా తినేయగలదు. అలాగే తన పదునైన పళ్లతో ప్రత్యర్థిని ఇట్టే చీల్చగలదు. చిరుత పులి, కొండచిలువ తారసపడితే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి క్రూర జంతువుకు చుక్కలు చూపించింది ఓ కొండచిలువ. ఇప్పుడు దానికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అనుకోకుండా చిరుత పులి, కొండచిలువ తారస పడగా వాటి మధ్య భీకర పోరు సాగింది. ఒక్క వేటుతో కొండచిలువను చీల్చుదామనుకుంటే దానికి భయపడి తప్పించుకోవాల్సిన పరిస్థితి చిరుతకు వచ్చింది. చిరుత పులిని కొండచిలువ చుట్టుకోవడంతో ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుంది. ఇక ఎలాగోలా కొండచిలువ నుండి తప్పించుకున్న పులికి తిరిగి ప్రాణం వచ్చినట్లు అయింది. ఇక వెనకకు చూడకుండా ఆ పులి అడవిలోకి వెళ్ళిపోయింది.

https://www.youtube.com/watch?v=K-KAXxlwDWE