భార్యకు సీటు ఇమ్మన్నందుకు భర్తని రైలులో చితక్కొట్టారు తర్వాత ఏమైందంటే

భార్యకు సీటు ఇమ్మన్నందుకు భర్తని రైలులో చితక్కొట్టారు తర్వాత ఏమైందంటే

0
92

రైలు ప్రయాణాలు చేసే సమయంలో జనరల్ బోగీలో సీటు కోసం కొన్ని సార్లు ప్రయాణికులు కొట్టుకునే వరకూ వెళతారు.. అయితే ఈ సమయంలో వివాదాలు లేకుండా టీసీ లేదా పక్కవారు సర్దిచెప్పినా.. కొందరు మాత్రం వీరావేశం చూపిస్తారు, తాజాగా ఇలాంటి దారుణమైన ఘటనే జరిగింది. కాని అతని ప్రాణాలే పోయాయి.

ఓ వ్యక్తి తన బంధువులు చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రైలు ఎక్కాడు.. తన భార్య కూతురుతో కలిసి ట్రైన్ ఎక్కాడు.. అతని వయసు 26, భార్య వయసు 22, కూతురు వయసు 2 సంవత్సరాలు, ఈ సమయంలో రైలులో ఓ మహిళ మొత్తం సీటుని ఆక్రమించుకుని కూర్చుంది.. ఇది జనరల్ బోగీ తన భార్యకు కాస్త చోటు ఇవ్వమని అడిగాడు.. ఆమె ఇవ్వను అంది ..దీంతో ఇద్దరి మధ్య తగువ పెరిగింది.

ఈ సమయంలో బోగిలో ఆ మహిళకు సంబంధించిన బంధువులు వచ్చి అతనిని చితక్కొట్టారు , ఆమె భార్య ఎంత బతిమలాడినా వారు వదలలేదు ..మొత్తం 12 మంది ఆ వ్యక్తిపై దాడి చేశారు.. తర్వాత స్టేషన్ లో అతనిని రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు.. కాని అప్పటికే అతను చనిపోయాడు.. దీంతో వారి అందరిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై – బీదర్ మధ్య ఈ ఘటన జరిగింది.