మాస్క్ ధరించి రెస్టారెంట్ కు వస్తే అదనపు వడ్డన – ఇదేం రూల్ బాబు

Fine if you come to the restaurant wearing a mask

0
124

ఇదేమిటి మాస్క్ ధరిస్తే తప్పేంటి అని మీకు అనిపించిందా. అసలే కరోనా ఈ సమయంలో అన్నీ దేశాల్లో మాస్క్ మస్ట్ అయింది. మరి ఇలాంటి వేళ ఈ రూల్ ఏమిటా అని అనుమానం రావచ్చు. ఎందుకంటే బయటకు వచ్చిన సమయంలో మాస్క్ ధరించకపోతే భారీ ఫైన్లు వేస్తున్నారు. అమెరికా నుంచి అంబాజీపేట వరకూ అంతా ఇదే రూల్ అమలు చేశారు.

మరి ఇప్పుడు ఈ వింత రూల్ ఏమిటంటే. అమెరికాలో చాలా వరకూ అందరికి కరోనా టీకాలు వేశారు. ఇక మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని అమెరికా ప్రకటన చేసింది.అయితే కాలిఫోర్నియాలో ఫిడిల్హెడ్ కేఫ్ రెస్టారెంట్ ఈ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఎవరైనా రెస్టారెంట్ కు మాస్క్ పెట్టుకుని వస్తే అదనంగా 5 డాలర్లు ఫైన్ తీసుకుంటోంది.

అయితే దీని వెనుక ఓ సదుద్దేశం ఉందట. చాలా మంది భయపడి ముందుజాగ్రత్తగా మాస్కులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్ ఈ నిబంధన తీసుకొచ్చింది. ఇలా ఐదు డాలర్లు పోయినా పర్వాలేదు కానీ, మాస్క్ ధరిస్తాం అంటున్నారు జనం. ఇలా ఐదు డాలర్లు అదనంగా వచ్చిన నగదుని స్వచ్ఛంద సంస్థకు అందిస్తామని, రెస్టారెంట్ యజమాని క్రిస్ చెబుతున్నారు . ఇంతకీ ఈ రూల్ వెనుక ఉన్న ఉద్దేశం ఇదట.