మొదటి పెళ్లి దాచిపెట్టి రెండో వివాహం చేసుకుంది తర్వాత దారుణం

మొదటి పెళ్లి దాచిపెట్టి రెండో వివాహం చేసుకుంది తర్వాత దారుణం

0
119

వివాహం అనేది ఎంతో పవిత్ర బంధం ..అయితే కొందరు మాత్రం దీనిని చాలా ఈజీగా తీసేస్తారు, వివాహం అయిన తర్వాత భార్యని వదిలెయ్యడం, భర్తకి తెలియకుండా యువతి వేరే వారితో అఫైర్ పెట్టుకోవడం ఇలాంటి కేసులు ఈమధ్య చాలా జరుగుతున్నాయి, అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది ..కాని చివరకు అత్యంత దారుణం విషాదం మిగిల్చింది.

తమిళనాడులోని తిరుపత్తూరులో ఓ వ్యక్తి అక్కడే పక్క గ్రామంలో యువతని వివాహం చేసుకున్నాడు, వారికి ఓ రెండేళ్ల పాప ఉంది, మొత్తానికి ఆమె ఇటీవల భర్తని వదిలేసింది, తర్వాత వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది.

ఆ వ్యక్తికి మాత్రం తనకు ముందు పెళ్లి అయింది అని చెప్పలేదు, దీంతో ఆమె రెండో భర్తకు అసలు విషయం తెలిసి.. ఆమె బిడ్డని నేలకి బాదాడు, దీంతో ఆ బిడ్డ చనిపోయింది, కాని ఆమె తన మొదటి భర్త దగ్గరకు బిడ్డను తీసుకువెళ్లి జబ్బుతో చనిపోయింది అని చెప్పింది, అనుమానంతో పోలీసుల కేసు పెడితే ఆమె తలపై గాయాలు ఉన్నాయి, దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తే, నిజం దాచి పెళ్లి చేసుకోవడంతో ఇలా చేశాను అని చెప్పాడు రెండో భర్త, దీంతో చిన్నారి ప్రాణం పొట్టన పెట్టుకున్నారు, వారిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.